దాడులకు భయపడం
తిరుమలగిరి (తుంగతుర్తి): కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులకు భయపడేది లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరిలో జరిగిన ఘర్షణలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.రైతురుణ మాఫీ కోసం తిరుమలగిరిలో బీఆర్ఎస్ శిబిరంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటే దేనికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. రుణమాఫీపై ఇచ్చిన హామీలను తప్పి దేవుళ్ల మీద ఒట్టేసి రైతులను మోసం చేసిన సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. మొన్న సిద్దిపేటలో హరీష్‌రావు ఇంటిపై ఇప్పుడు తిరుమలగిరిలో బీఆర్ఎస్ శ్రేణులపై దాడులను ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లింగయ్యయాదవ్, యుగేందర్‌రావు, తిరుమలగిరి, నాగారం, తుంగతుర్తి మండల పార్టీల అధ్యక్షులు సంకెపల్లి రఘునందన్‌రెడ్డి, ఉప్పలయ్య, తాటికొండ సీతయ్య, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, గుండగాని రాములు, చిప్పలపల్లి మహేందర్, ప్రవీణ్, బాబు, సందీప్‌నేత, దయాయాదవ్, నాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment