అభివృద్ధి పనుల్లో అలసత్వం సహించను
కోదాడ: కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి నిరంతం కృషి చేస్తున్నామని, అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు సంబంధించి నీటిపారుదల, వ్యవసాయం, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, విద్య, వైద్యారోగ్యశాఖల పనితీరుతో పాటు వాటిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సోమవారం కోదాడలోని కాశీనాథం ఫంక్షన్‌హాల్‌లో అధికారులతో మంత్రి సమీక్షించారు. నీటిపారుదలశాఖలో గడిచిన రెండు నెలలుగా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాన్‌పహాడ్ ఎత్తిపోతల, ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకాల పనులను ఆలస్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. అభివృద్ధి పథకాలకు ఎన్ని నిధులు కావాలన్నా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, కోదాడ, హుజూర్‌నగర్ ఆర్డీఓలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఏర్నేనిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment