తిరుమలగిరి మార్కెట్‌కు 24,746 బస్తాల ధాన్యం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు ఈ సీజన్‌లోనే అత్యధికంగా సోమవారం 24,746 బస్తాల ధాన్యం వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ వెల్లడించారు. క్వింటాకు గరిష్టంగా రూ.2061, కనిష్టంగా రూ.1880 ధర పలికినట్లు తెలిపారు.
రుణాలు త్వరగా
పంపిణీ చేయాలి
సూర్యాపేట : రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలను త్వరగా పంపిణీ చేయాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీసీసీబీ డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇస్తున్న పథకాలను సద్వియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్లు ఎ. శ్రవణ్ కుమార్, గుడిపాటి సైదులు, కొండ సైదయ్య, బ్యాంకు సీఈఓ శంకర్‌రావు, జేఆర్‌ఓఎస్డీ మైఖేల్ బోస్, సూర్యాపేట జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, డీజీఎం ఉపేందర్ రావు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.
మజ్దూర్ యూనియన్‌తోనే రైల్వే కార్మికులకు మేలు
మఠంపల్లి: మజ్దూర్ యూనియన్‌తోనే రైల్వే కార్మికులకు మేలు జరుగుతుందని దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్ అన్నారు. సోమవారం ఆయన మజ్దూర్ యూనియన్ మధిర బ్రాంచ్ ఆధ్వర్యంలో మఠంపల్లి సెక్షన్‌లో సికింద్రాబాద్ డివిజన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కీమెన్ బీట్ లెంత్ తగ్గించాలని ఉద్యోగులు కోరడంతో వెంటనే అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వారం రోజుల్లో ఆదేశాలు ఇప్పిస్తామని హామీ ఇప్పించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మజ్దూర్ యూనియన్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సంపత్‌రావు, యుగంధర్, అంజయ్య, చైర్మన్ వెంకట్, సీసీయాస్ డెలిగేట్స్ కిరణ్, కిషోర్, శ్రీనివాస్, వినయ్, కృష్ణ, చారి, రామక్రిష్ణ పాల్గొన్నారు.
శివాలయంలో
విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదాద్రికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు చేపట్టారు. సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర పూజలు నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున స్వయంభూలను సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు... ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చన చేశారు. ఆలయ ముఖమండపం, ప్రాకార మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం తదితర పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment