ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ రూరల్ : విద్య ప్రమాణాలు నైపుణ్యాల పెంపు కోసం అదనపు కోర్సులు నిర్వహించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం యూనివర్సిటీలో అన్ని శాఖల అధిపతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. నైపుణ్యాలు పెంచేందుకు ప్రతి విభాగం నుంచి అదనపు కోర్సులు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అదనంగా నైపుణ్య శిక్షణలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు, సిబ్బంది క్వార్టర్స్‌లో నివసించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ రవి, ఓఎస్‌డీ అంజిరెడ్డి, అధ్యాపకులు రవి, రమేష్, ఉపేందర్‌రెడ్డి, శ్రీదేవి, అరుణ ప్రియ, సుధారాణి, మాధురి, రూప, తిరుమల, రామచంద్రగౌడ్, రమేష్, రాజేష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment