నడిగూడెం : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులైనా కొనుగోళ్లు వేగం పుంజుకోక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, జిల్లా కమిటీ సభ్యుడు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కాసాని కిషోర్, కొలిశెట్టి యాదగిరిరావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, ఏనుగుల వీరాంజనేయులు, లతీఫ్బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment