రైతులు నాణ్యమైన ధాన్యం తేవాలి
సూర్యాపేట: రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. మంగళవారం సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. సన్న ధాన్యానికి ప్రభుత్వం అందించే రూ. 500బోనస్‌ను పొందాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని ఐకేపీ నిర్వాహకులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. రహదారులపై ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని ఆరబెట్టవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట డీఆర్డీఓ అప్పారావు, ఏపీడీ సురేష్, తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, డీటీ నాగలక్ష్మి, ఏపీఎం వెంకయ్య, సీసీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment