అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Published Wed, Nov 6 2024 1:57 AM | Last Updated on Wed, Nov 6 2024 1:57 AM

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

సాక్షి,యాదాద్రి: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హనుమంత రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. యాదాద్రి దేవస్థానం, మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పోలీస్‌ శాఖ పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గంగాధర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, భువనగిరి ఏసీపీ రవి కిరణ్‌ రెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌ రెడ్డి, యాదాద్రి దేవస్థానం ఏసీపీ సైదులు, ఎకై ్సజ్‌ ఈఎస్‌ సైదులు, డీఆర్‌డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement