పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలి
సూర్యాపేట టౌన్: జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణలో పోలీసులు బాగా పనిచేస్తున్నారని, అలాగే ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ కేక్ చేసి పోలీసులకు, సిబ్బందికి మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నేరాల నియంత్రణకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్‌రెడ్డి, డీఎస్పీలు రవి, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాసరావు, మట్టయ్య, నరసింహాచారి, మంజుభార్గవి, సీఐలు వీరరాఘవులు, రాజశేఖర్, శ్రీను, రఘువీర్‌రెడ్డి, రాము, రజితారెడ్డి, రామకృష్ణారెడ్డి, చరమందరాజు, లక్ష్మీనారాయణ, నాగభూషణం, హరిబాబు, శివకుమార్, ఆర్‌ఐ నారాయణరాజు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కుటుంబాల సంక్షేమానికి కృషి
పోలీస్ కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. సూర్యాపేట ఆర్ముడ్ రిజర్వ్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా పోలీస్ భద్రతా పథకం ద్వారా మంజూరైన చెక్కును శుక్రవారం సూర్యాపేటలోని తన కార్యాలయంలో రాములు ఆయన కుటుంబ సభ్యులకు ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీస్ భద్రతా పథకం.. పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ఎళ్లవేళలా బాసటగా ఉంటుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారు ఏ అవసరమున్నా తమను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఓ మంజుభార్గవి పాల్గొన్నారు.
ఫ ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment