జాన్‌పహాడ్ ఉర్సుకు సిద్ధంకండి
పాలకవీడు: పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌లో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరగనున్న ఉర్సు ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంలో పనిచేస్తూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. దర్గా ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం జాన్‌పహాడ్ దర్గా వద్ద ఎస్‌కెఎస్ ఫంక్షన్‌హాల్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ, వక్ఫ్‌బోర్డు అధికారులకు సూచించారు. దర్గా పరిసరాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే అన్ని శాఖలతో రివ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముందుగా దర్గను దర్శిచుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్గా పరిసరాలు, వివిధ రూట్లలో పార్కింగ్ స్థలాలు పరిశీలించారు.
వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి
దర్గా వద్ద సరైన వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వక్ఫ్‌బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు రూ.రెండు కోట్ల ఆదాయం సమకూరుతున్న ఈ ఉత్సవాలకు కనీసం రూ.50 లక్షలు నిధులు మంజూరు చేసేలా అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి, సీఐ చరమందరాజు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, మాజీ జెడ్పీటీసీ బుజ్జిమోతీలాల్, నాయకులు ఎన్‌వీ.సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
ఫ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం
Comments
Please login to add a commentAdd a comment