కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణంలో అవినీతి, అక్రమాలకు పాల్పడడంతో పాటు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డీజేపీఆర్ కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్‌పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు. డీజేపీఆర్ సంస్థ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో డీపీజేఆర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని దాని డీపీఆర్ మార్చి నిర్మాణ పనులు మొదలుపెట్టిందని పేర్కొన్నారు. పనులు జరిగే సమయంలో రక్షణ చర్యలు పాటించకపోవడంతో రోగులు, బంధువులు ఇబ్బందులు పడుతున్నారని, ఇదే విషయమై గతంలో హాస్పిటల్‌ను పార్టీ ఆధ్వర్యంలో సందర్శించినపుడు అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. నిర్మాణంలో జరిగే లోపాల్ని, రక్షణ చర్యలు తీసుకోకుండా నిర్మిస్తున్న విధానాల్ని ఖండిస్తూ సూర్యాపేట ఏరియా ఆస్పత్రి ముందు రోడ్డుపై ధర్నా చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహంతో అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, పట్టణ కార్యదర్శి గులాం హుస్సేన్, డివిజన్ నాయకులు ఎస్కే.సయ్యద్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, సహాయ కార్యదర్శి సంతోషి మాతా పాల్గొన్నారు.
ఫ సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ నేతల డిమాండ్
ఫ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా
Comments
Please login to add a commentAdd a comment