అర్హులను ఓటర్లుగా నమోదు చేయాలి
ఫ ఓటరు జాబితా పరిశీలకురాలు
బాల మాయాదేవి
నల్లగొండ : 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఓటరు నమోదు, తుది ఓటరు జాబితా ప్రచురణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణలో భాగంగా తుది ఓటరు జాబితా ప్రచురించినప్పటికీ 18 సంవత్సరాలు నిండి అర్హత ఉన్న వారందరినీ ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం అన్ని పోలింగ్ కేంద్రాలు, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్‌లో తుది ఓటరు జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. జాబితాలో ఎవరి పేరైనా లేకపోతే తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. అంతకు ముందు నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆమెకు కలెక్టరేట్ వద్ద పూల మొక్క అందచేసి స్వాగతం పలికారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఓటరు నమోదు అధికారులు, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment