అర్జీలను త్వరగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 87 వినతులు స్వీకరించారు. అనంతరం వన మహోత్సవం–2025 జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రానున్న వర్షాకాలంలో శాఖల వారీగా ప్రభుత్వం 59 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇచ్చిన లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈనెల 9వ తారీఖున నిర్వహించే మోటార్ సైకిల్ ర్యాలీలో ఒక్కరూ హెల్మెట్ ధరించి పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.రాంబాబు, డీఎఫ్‌ఓ సతీష్‌కుమార్, డీఆర్‌డీఓ వీవీ.అప్పారావు, డీడబ్ల్యూఓ నరసింహారావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కె.లత, సీపీఓ ఎల్.కిషన్, డీఎంహెచ్‌ఓ కోటాచలం, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి జగదీశ్‌రెడ్డి, డీటీడీఓ శంకర్, డీఈఓ అశోక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్‌నాయక్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్‌రెడ్డి, పశుసంవర్ధక అధికారి డి.శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, డీఎస్‌ఓ డి.రాజేశ్వర్, డీపీఓ నారాయణరెడ్డి, పీఆర్ ఈఈ మాధవి, డీఐఈఓ భానునాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
25 నాటికి సీఎంఆర్ ఇవ్వాలి
యాసంగి 2023–24 సీజన్‌కు సంబంధించి సీఎంఆర్‌ను ఈనెల 25వ తేదీ నాటికి ఎఫ్‌సీఐకి అప్పగించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం–2024–25 సీఎంఆర్‌ను కూడా వెంటనే ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాలన్నారు. అన్ని చౌకధరల దుకాణాల డీలర్లు సమయపాలన పాటిస్తూ పీడీఎస్ బియ్యం సకాలంలో కార్డుదారులకు అందించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, డీఎస్‌ఓ రాజేశ్వర్, డీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో కలెక్టర్
తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment