చట్టాలపై అవగాహన అవసరం
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం అవసరమని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి పేర్కొన్నారు. మంగళవారం చివ్వెంల మండలం రామ్‌కోటి తండాలోని చార్లెట్ హోం అనాథాశ్రమాన్ని ఆమె సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ఉన్నత పౌరులుగా ఎదగి సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలన్నారు. నిరుపేద విద్యార్థుల కోసం ఆశ్రమ నిర్వాహకులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ వసంత సత్యనారాయణ పిళ్లే స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, పెండెం వాణి, న్యాయవాదులు సుధాకర్, విజయ్, సీడబ్ల్యూసీ చైర్మన్ రమణారావు, ఆశ్రమ నిర్వాహకులు జాటోతు డేవిడ్‌రాజ్, రంగమ్మ పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి
Comments
Please login to add a commentAdd a comment