కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట) : అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ రాంబాబుకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పదో న్నతి పొందిన వారికి పెంచిన గౌరవ వేతనం 9 నెలలు పెండింగ్ లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు దంతాల రాంబాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగులోతు రాజారాం, తెలంగాణ అంగన్‌వాడీ టీచర్, హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు గౌరోజు రమ, రేకల సుమిత్రాదేవి, బందెల భాగ్యమ్మ, ఆకుల సరస్వతి, శోభారాణి, పులుసు మంజుల జిల్లా నవనీత, హరిత కందుకూరి ఆండాలు, అంజలి సునంద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment