ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
మునగాల: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. మంగళవారం మునగాల మోడల్‌స్కూ ల్‌ను సందర్శించి ఉపాధ్యాయులు, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదర్శపాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించనున్నట్లు చెప్పారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ బూర సైదయ్య గౌడ్ , ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీగా రెండోసారి గెలిపించాలి
వరంగల్–ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను రెండో సారి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. మంగళవారం మునగాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో విరామ సమయంలో తన ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషిచేశానని తిరిగి గెలిపిస్తే పెండింగ్‌లో ఉన్నవాటి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ మండల బాధ్యులు, స్థానిక ప్రధానోపాధ్యాయుడు పిడతల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment