జూనియర్ కాలేజీల్లో 90రోజుల ప్రణాళిక
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 90 రోజుల ప్రణాళిక అమలు చేసి ఉత్తీర్ణత శాతం పెంచాలని ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ, ప్రత్యేక అధికారి భీంసింగ్ పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, అధ్యాపకుల టీచింగ్ డైరీలు, హాజరు పట్టికలను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. జూనియర్ కళాశాలల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేయాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జిల్లా స్థాయిలోనే కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ భానునాయక్, ప్రిన్సిపల్ పెరుమాళ్ల అన్నపూర్ణ, అధ్యాపకులు వీడీఎస్ ప్రసాద్, వాసు, సైదులు, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీంసింగ్
Comments
Please login to add a commentAdd a comment