ముక్కోటికి మట్టపల్లి ముస్తాబు
మఠంపల్లి: మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం ముక్కోటికి ముస్తాబైంది. ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్షేత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాక దేశ విదేశాలనుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలకు ఉత్సవాలను పాలకవర్గం, అర్చకులు వేదమంత్రాలతో ప్రారంభించనున్నారు. అదేరోజు రాత్రి సీతాకల్యాణం, హరికథ, శ్రీలక్ష్మీనృసింహ నామసంకీర్తన నిర్వహిస్తారు.10న ఉదయం 5గంటలకు సుప్రభాతసేవ, శ్రీస్వామివారి వైకుంఠ(ఉత్తర) ద్వార దర్శనం, పురాణ కాలక్షేపం, గ్రామోత్సవం ,భక్త ప్రహ్లాద హరికథ, శ్రీమట్టపల్లి క్షేత్ర మహత్యం బుర్రకథ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు అందించేందుకు అవసరమైన ప్రసాదాలు సిద్ధంచేస్తున్నారు. వివిధ కులాల అన్నదాన సత్రాలు భక్తులకు ఉచిత భోజనవసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఫ 10న తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనం
ఫ భారీగా తరలిరానున్న భక్తులు
ఫ అన్ని ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
ఏర్పాట్లు పూర్తి చేశాం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే స్వామి వారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. కృష్ణానదీస్నానం, వైకుంఠ ద్వారదర్శనం, ఉచిత అన్నదానం, ప్రసాదాల తయారీ, ఆర్టీసీ బస్సుల సౌకర్యం ,మంచినీటి సరఫరా తదితర ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి.
–చెన్నూరు విజయ్‌కుమార్
అనువంశిక ధర్మకర్త, మట్టపల్లి
Comments
Please login to add a commentAdd a comment