హెచ్‌ఎంపీవీపై అప్రమత్తం
పాటించాల్సిన జాగ్రత్తలు ఇలా..
● కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలే తీసుకోవాలి.
● ముక్కుకు కర్చీఫ్, టిష్యూ పేపర్, మాస్కు ధరించాలి.
● జనసంచారం ఉన్న ప్రాంతాల్లో దూరంగా ఉండాలి.
● చేతులను సబ్బుతో గానీ శానిటైజర్‌తోగానీ కడుక్కోవాలి.
● చేతులు కడుక్కోండా కళ్లు, ముక్కు, నోటిని తాకవద్దు.
● జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
● మరిగించి చల్లార్చిన నీటిని తాగాలి. ● కరచాలనం చేయొద్దు.
● వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి.
తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రస్తుతం చైనాను గడగడలాడిస్తున్న హెచ్‌ఎంపీవీ (హ్యూమన్‌మెటపెన్నోవో వైరస్) భారత్‌కు చేరుకుంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రభుత్వ ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలుంటే జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment