సూర్యాపేటటౌన్ : అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.12వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రైతులకు సమయానికి పంటపెట్టుబడి కోసం రైతుబంధు ఇచ్చి ఆదుకున్నారన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరాకురూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు వై.వి, ఆకుల లవకుశ, బూర బాలసైదులుగౌడ్, గండూరి కృపాకర్, సత్యనారాయణ, దేవత్ కిషన్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
లింగయ్య యాదవ్
Comments
Please login to add a commentAdd a comment