గోదావరి జలాలు తగ్గిస్తూ.. పెంచుతూ..
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను గోదావరి జలాలను బుధవారం విడుదల చేయగా గురువారం రాత్రి ఒక్క సారిగా తగ్గించారు. తొలుత 500క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఆ తర్వాత 800 క్యూసెక్కులకు పెంచారు. మళ్లీ గురువారం రాత్రి 500 క్యూసెక్కులకు తగ్గించారు. శుక్రవారం రాత్రి మైలారం రిజర్వాయర్ నుంచి నీళ్లు బయ్యన్నవాగుకు వదలడంతో మళ్లీ జిల్లాకు 700 క్యూసెక్కులకు పెంచినట్టు నీటి పారుదలశాఖ ఏఈఈ అమర్ తెలిపారు.
మెరుగైన వైద్యసేవలు
అందించాలి
నాగారం: వైద్యసిబ్బంది.. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం నాగారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, తప్పనిసరిగా యూనిఫాం ధరించాలన్నారు. పలు సూచనలు చేశారు. సమావేశంలో డాక్టర్ హర్షవర్ధన్, హెచ్‌ఈఓ మాలోతు బిచ్చునాయక్, హెచ్‌ఈ విమలమ్మ, పీహెచ్‌ఎన్ అరుణకుమారి, సూపర్‌వైజర్ వినోద, రామచంద్రు, పల్లె దవాఖాన డాక్టర్లు శ్రవణ్‌కుమార్, నాజీయ, సుజాత, సరస్వతి, యాదగిరి, ప్రవీణ్‌రెడ్డి, అరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment