పట్టణ ప్రగతికి నిధులు!
27తో ముగియనున్న
పాలక వర్గాల పదవీకాలం
జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీకాలం ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే స్టాంప్ డ్యూటీ నిధులను మున్సిపాలిటీల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిధులు ఎలా, ఏయే పనులకు ఖర్చు చేయాలో గైడ్‌లైన్స్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నిధులను జిల్లా అదనపు కలెక్టర్ అనుమతితో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులను చేపట్టిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోందని పలువురు అంటున్నారు.
కోదాడ: ఏడాదిన్నర కాలంగా పట్టణ ప్రగతికి నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మున్సిపాలిటీలకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన స్టాంప్ డ్యూటీ ఆదాయాన్ని పాత పద్ధతిలో నేరుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మున్సిపాలిటీలకు ఆర్థిక కష్టాలు తీరనున్నాయి. ఇదే జరిగితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు మున్సిపాలటీలకు ఏటా కోట్లాది రూపాయల నిధులు నేరుగా ఖాతాల్లో జమకానున్నాయి. స్థానిక ఎన్నికల ముందు అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ)లకు కూడా స్టాంప్ డ్యూటీ నేరుగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గతంలో 4 శాతం నిధులు..
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్టాంప్ డ్యూటీని గతంలో 4 శాతం స్థానిక సంస్థల ఖాతాల్లో నేరుగా జమచేసేవారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నిధులను మున్సిపాలిటీలకు ఇవ్వకుండా ప్రభుత్వం నేరుగా తీసుకోసాగింది. ఆ తరువాత పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరుతో ప్రతినెలా కొన్ని నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేశారు. వీటితో ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో అభివృద్ధి పనులను చేపట్టేవారు. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఈ నిధుల విడుదలను ప్రభుత్వం నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పట్టణ ప్రగతి, పల్లెప్రగతి పథకాలను నిలిపివేశారు. దీంతో గడిచిన ఏడాదిన్నర కాలంగా నిధులులేక మున్సిపాలిటీల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. పనులను చేసిన కాంట్రాక్టర్లకు సైతం కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఫ మున్సిపాలిటీలకు స్టాంపు డ్యూటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
ఫ నేరుగా ఖాతాల్లో జమకానున్న నిధులు
ఫ గత ప్రభుత్వం అమలు చేసిన విధానం మార్పు
ఫ నిధుల లేమిని నుంచి గట్టెక్కనున్న మున్సిపాలిటీలు
మున్సిపాలిటీ నిధులు
(ఏడాదికి రూ.కోట్లలో..)
సూర్యాపేట 8
కోదాడ 6
హుజూర్‌నగర్ 4
తిరుమలగిరి 3
నేరేడుచర్ల 3
Comments
Please login to add a commentAdd a comment