సావిత్రిబాయి కృషితోనే మార్పు
భానుపురి (సూర్యాపేట): సావిత్రిబాయి పూలే త్యాగాలతోనే సమాజంలో మార్పు మొదలైందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. భారత్ స్వాతంత్య్ర దేశంగా అవతరించక ముందే దేశంలో అణగారిన వర్గాలు, సీ్త్రల హక్కులు, విద్య కోసం మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు ఎంతగానో పోరాడారని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ పి.రాంబాబు మాట్లాడుతూ నేటి ఉపాధ్యాయులు.. సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అశోక్, సంక్షేమ శాఖ అధికారులు లత, అనసూర్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్‌రెడ్డి, సూపరింటెండెంట్లు పద్మారావు, శ్రీలత, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలతో వచ్చే ప్రజలను ఆదుకోవాలి
సమస్యలతో వచ్చే ప్రజలకు సహాయం చేస్తూ ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి ఆయన ఇటీవల టీజీపీఎస్‌సీ ద్వారా ఉద్యోగం పొందిన 47 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి రెవిన్యూ శాఖలో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించినందుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండ్ పద్మారావు, సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి
ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ రోడ్డు ప్రభుత్వ భద్రతా మాసోత్సవం–2025 వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కొత్త సంవత్సరం ఈనెల 31 జాతీయ రహదారి భద్రత మాసవోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ పి.రాంబాబు, జిల్లా రవాణా శాఖ అధికారి జి.సురేష్‌రెడ్డి, ఎంబీఏ జయప్రకాశ్‌రెడ్డి, ఈ ఆదిత్య, డీబీఐ ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment