డెల్టా జిల్లాల్లో వర్షాలు | - | Sakshi
Sakshi News home page

డెల్టా జిల్లాల్లో వర్షాలు

Published Mon, Nov 18 2024 2:48 AM | Last Updated on Mon, Nov 18 2024 2:48 AM

-

సాక్షి, చైన్నె: రాష్టంలోని డెల్టా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం పలుచోట్ల భారీ వర్షం పడింది. కడలూరు జిల్లాలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాగపట్నం, మైలాడుతురై, తంజావూరు, పుదుకోట్టై తదితర జిల్లాలో విస్తారంగా వానలు పడుతున్నాయి. తిరుకాట్ట పల్లి గ్రామంలో పిడుగు పడడంతో రైతు ఆర్ముగం భార్య భానుమతి(58) మరణించారు. ఇక నీలగిరులలోనూ మోస్తరుగా వర్షం పడుతోంది. కున్నూరు పరిసరాలలో కురిసిన వర్షానికి కొన్ని చోట్ల కొండ, మట్టి చరియలు విరిగి పడడంతో వాహనాల రాక పోకలు ఆటంకం తప్పలేదు.

లైంగికదాడికి వృద్ధుడి అరెస్టు

సేలం: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. సేలం జిల్లా తమ్మంపట్టి పరిధిలోని 5వ వార్డుకు చెందిన ఆరేళ్ల చిన్నారికి అనారోగ్యం ఏర్పడడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌ ద్వారా ఆత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్టు తెలిపారు. ఈ విషయం గురించి చిన్నారి వద్ద తల్లిదండ్రులు విచారించగా.. గత 9వ తేది తల్లిదండ్రి ఇద్దరూ పనికి వెళ్లిన సమయంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న చిన్నారిపై పొల్జియం కాలనీకి చెందిన శాంతప్పన్‌(70) పశువుకు పచ్చి గడ్డి కోసుకుని వద్దామని తెలిపి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన చిన్నారి తల్లిదండ్రులు ఆత్తూరు మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి శాంతప్పన్‌ను అరెస్టు చేసి, జైలుకు తరలించారు.

శిశువు కిడ్నాప్‌ కేసులో యువతి అరెస్ట్‌

అన్నానగర్‌: తిరువేర్కాడు ప్రాంతానికి చెందిన హరి. ఇతని భార్య దీప. వీరికి పిల్లలు లేరు. ఈ పరిస్థితిలో దీప గర్భవతిగా ఉన్నట్టు నటించింది. ఇక కన్నగి నగరానికి చెందిన నిశాంతికి పుట్టిన 45 రోజుల మగబిడ్డకు గత 13వ తేదీ ప్రభుత్వ సంక్షేమ సహాయం ఇప్పిస్తానని మోసం చేసి బిడ్డను కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కన్నగి నగర్‌ పోలీసులు తీవ్ర విచారణ చేపట్టారు. అప్పుడు కిడ్నాప్‌నకు గురైన బిడ్డను దీప తన భర్త వద్ద తనకు బిడ్డ పుట్టిందని తెలిపి తిరువేర్కాడులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి భర్తను పిలిపించి, బిడ్డను వదిలి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. పరారీలో ఉన్న దీప కోసం ఇన్‌స్పెక్టర్‌ దయాళ్‌ నేతృత్వంలోని స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ కూడా వెతికింది. ఇందులో దీప ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను పరిశీలించగా కరూర్‌ సమీపంలోని ఓ గ్రామంలో ఆమె తలదాచుకున్నట్లు గుర్తించారు. ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగి దీపను ఆదివారం అరెస్టు చేశారు. ఆమెను ప్రత్యేక పోలీసులు చైన్నెకి తీసుకొచ్చారు.

రైతు సంఘం

నాయకుడిపై దాడి

తిరుత్తణి: రైతు సంఘాల సమాఖ్య మండల అధ్యక్షుడిగా లింగమూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మండల వ్యవసాయ శాఖ సహాయ డైరెక్టర్‌ ప్రేమ్‌ తన సిబ్బందితో డిజిటల్‌ పంట సర్వే పనులు చేపట్టేందుకు టీసీ కండ్రిగకు చేరుకున్నారు. అక్కడి క్రషర్‌ ప్లాంట్‌ సిబ్బంది అధికారులను అడ్డుకుని, నిర్బంధించారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన వ్యవసాయ సంఘం నాయకుడు లింగమూర్తిపై క్రషర్‌ సిబ్బంది దాడి చేశారు. సంఘటనకు సంబంధించి క్రషర్‌ నిర్వాహకులను అరెస్టు చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌రాజు మాట్లాడుతూ.. అధికారులు తమ విధులను చేయనివ్వకుండా అడ్డుకున్న క్రషర్‌ సిబ్బంది తీరు దారుణమన్నారు. దీన్ని వ్యతిరేకించిన రైతు సంఘం మండల అధ్యక్షుడిపై దాడిని ఖండిస్తున్నట్లు, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరా రు. క్రషర్‌ సిబ్బంది, మేనేజర్‌ను అరెస్టు చే యాలని, రైతులకు, అధికారులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement