గల్లంతైన యువకుల కోసం గాలింపు | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన యువకుల కోసం గాలింపు

Published Mon, Nov 18 2024 2:48 AM | Last Updated on Mon, Nov 18 2024 2:48 AM

-

అన్నానగర్‌: చైన్నె వెస్ట్‌ అన్నానగర్‌లోని కంబర్‌ కాలనీకి చెందిన గిరీష్‌(20) మొగప్పేర్‌లో ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నాడు. అదే జిల్లాకు చెందిన రియాజ్‌(18) ఓ ప్రైవేట్‌ క్యాటరింగ్‌ కంపెనీలో వంట మనిషిగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు గిరీష్‌, రియాజ్‌, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మామల్లపురం వచ్చారు. తర్వాత సముద్రతీర ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న మత్స్యకారుల ప్రాంతానికి సమీపంలో ఉన్న సముద్రంలో అందరూ స్నానాలు చేశారు. ఆ సమయంలో గిరీష్‌, రియాజ్‌లు పెద్ద అలల్లో చిక్కుకున్నారు. అలలు సముద్రంలోకి ఈడ్చుకెళ్లిపోయాయి. షాక్‌కు గురైన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించారు. గిరీష్‌, రియాజ్‌లు సముద్రంలో మునిగి స్పృహ కోల్పోయారు. ఇందుకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, కోస్ట్‌గార్డు, మత్స్యకారుల సాయంతో బోటు వద్దకు వెళ్లి వెతికినా సముద్రంలో మునిగిపోయిన వారి ఆచూకీ లభించలేదు. ఈ స్థితిలో ఆదివారం ఉదయం 2వ రోజు వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. గిరీష్‌, రియాజ్‌ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement