సముద్ర తీరం భద్రతపై అధ్యయనం
● కోస్ట్‌గార్డ్ పాత్రపై స్టాండింగ్ కమిటీ సమీక్ష
సాక్షి, చైన్నె: సముద్ర తీర భద్రత పటిష్టవంతం చేయడమే లక్ష్యంగా డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ అధ్యయనం చేసింది. కోస్టుగార్డ్ గస్తీ గురించి సమీక్షించింది. చైన్నె పర్యటనకు డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ శనివారం చైన్నెకు వచ్చిన విషయం తెలిసిందే. చైర్మన్, ఎంపీ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలోని ఈ కమిటీ తొలుత చైన్నెలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీని సందర్శించింది. ఆదివారం ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సభ్యులు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేష్ నేతృత్వంలోని అధికారులతో సమావేశమయ్యారు. తమిళనాడు తీరం, భద్రత, సముద్రంలో గస్తీ వంటి అంశాల గురించి చర్చించారు. కోస్ట్‌గార్డ్ పనితీరు, వ్యూహాత్మక కార్యక్రమాలు, తీర ప్రాంత భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధత గురించి సమగ్ర వివరాలను అధ్యయనం చేశారు. భారతదేశ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి, వివిధ భాగస్వామ్య దేశాల సమన్వయాన్ని మెరుగుపరచడానికి, సముద్ర భద్రత, భద్రతకు భరోసా విధానాలను మెరుగుపరచడానికి భారత కోస్ట్ గార్డ్ కొనసాగిస్తున్న అంశాలను ఈ సందర్భంగా పరమేష్ వివరించారు. అక్రమంగా చేపల వేట, అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి సముద్ర భద్రత, కోస్టల్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడం, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడంలో కోస్టుగార్డు ఫోర్స్ గణనీయమైన పురోగతి గురించి వివరించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల సాధించిన విజయాలపై కమిటీ సభ్యులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment