వేడుకగా సీటీఏ కార్తీక వనభోజనాలు
● ఆకట్టుకున్న పోటీలు
● విజేతలకు బహుమతి ప్రదానం
సాక్షి, చైన్నె: కార్తీక మాసం సందర్భంగా చైన్నె తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వనభోజనాల కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. చైన్నె పూందమల్లి సమీపంలోని క్వాలిటీ ఫార్‌మ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీటీఏ సభ్యులు, ఇతర తెలుగు వారు 340 మంది తరలి వచ్చారు. కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా వివిధరకాల ఆటలు, పాటల పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీలలో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీటీఏ అధ్యక్షుడు కె.గోపాలకృష్ణారెడ్డి, కార్యదర్శి సురేష్ గాడిపర్తి, ఉపాధ్యక్షుడు బి.వెంకయ్య నాయుడు, కోశాధికారి కె.నాగరాజు, సంయుక్త కార్యదర్శి ఎం.రామయ్య, కమిటీ మెంబర్లు శ్రీను బాబు, మధుకర్, రామ్ ప్రసాద్, కొండస్వామి నాయుడు, మాజీ కల్చరల్ సెక్రటరీ శ్రీకాంత్, మాజీ కార్యదర్శి పి.వి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగు వారందర్నీ ఏకం చేసి ప్రతి ఏటా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, వన భోజనాలు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. తెలుగు వారంతా ఆనందంగా జీవించాలని, అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని, తెలుగు వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment