– అర్జున్ సంపత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
కొరుక్కుపేట: కుమారుడి అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈశా యోగా కేంద్రానికి మద్దతుగా కోయంబత్తూరులో గత నెల 27న హిందూ పీపుల్స్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్ కుమారుడు ఓంకార్ బాలాజీ పాల్గొని, మాట్లాడారు. తన ప్రసంగంలో నక్కీరన్ గోపాల్‌ను ధూషించినట్లు సమాచారం. ఈ విషయమై కోయంబత్తూరు రేస్‌కోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఓంకార్ బాలాజీపై పోలీసులు కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఓంకార్ బాలాజీ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఓంకార్ బాలాజీని అరెస్ట్ చేయడంపై మధ్యంతర నిషేధం విధించారు. దీంతో ఈ కేసు 13వ తేదీన మరోసారి విచారణకు వచ్చింది. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించడంతో బాలాజీ అరెస్ట్‌పై ఇప్పటికే విధించిన నిషేధాన్ని పొడిగించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో కోర్టు నుంచి బయటకు వచ్చిన ఓంకార్ బాలాజీని కోయంబత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన: ఓంకార్ బాలాజీ అరెస్ట్ ఘటనను ఖండిస్తూ ఆదివారం కోయంబత్తూరు రెడ్‌క్రాస్ దగ్గర హిందూ పీపుల్స్ పార్టీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన తెలిపేందుకు వచ్చిన హిందూ పీపుల్స్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితోపాటు మొత్తం 25 మందిని అరెస్టు చేశారు. వారిని ప్రైవేట్ హాలులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment