సూర్య, చంద్రప్రభ వాహనాలపై కై లాస వాసుడు
చంద్రగిరి: తొండవాడ స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన శ్రీఅగస్తేశ్వరస్వామి(ముక్కోటి)వారి ఆలయంలో వారం రోజులుగా రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి, స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేపట్టారు. ఉదయం 6.30 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై విహరించారు. తదుపరి మధ్యాహ్నం ఆలయ ఆవరణలో కొలువైన మహాలక్ష్మీ అమ్మవారికి అభిషేక సేవ నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి స్వామి, అ మ్మవార్లు చంద్రప్రభ వాహ నంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మొగిలి రఘురామిరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నేడు పూలంగిసేవ..
ఉద్రపాదాల ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు పూలంగిసేవ నిర్వహించనున్నారు. ఉద యం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు జరుపుతారు. అనంతరం ఉదయం 10.30 నుంచి 12గంటల వరకు పూలంగిసేవను వేడుకగా నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment