అన్నానగర్: కొరటూరు ప్రాంతానికి చెందిన పునేష్(22) చైన్నెలోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రూ.45,000 విలువైన యాపిల్ వాచ్‌ని శనివారం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి డెలివరీ చేసేందుకు కరుణాకరన్(36) వచ్చాడు. తర్వాత పునేష్‌కు ఫోన్ చేసి శ్రీమీరు ఆర్డర్ చేసిన యాపిల్ వాచ్ డెలివరీ చేయడానికి ఎక్కడికి రావాలిశ్రీ అని అడగ్గా.. అన్నానగర్ ఏరియాకు రమ్మని తెలిపాడు. అక్కడికి రాగానే పార్సిల్‌ను విప్పి, చూపించాడు ఆ సమయంలో, కరుణాకరన్ రూ.48 వేలు చెల్లించమని అడిగాడు. జీపే ద్వారా డబ్బులు పంపానని చెప్పి, కరుణాకరన్‌ను అడగడంతో రాలేదన్నారు. అప్పుడు పునేష్ శ్రీఅయితే కాసేపు ఇక్కడే ఉండు, నేను ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుని వస్తాశ్రీ అని చెప్పి కరుణాకరన్‌కు పార్శిల్ ఇచ్చి వెళ్లిన పునేష్ తిరిగి రాలేదు. దీంతో అనుమానం చెందిన అతను ఆ పార్శిల్ చూసి షాక్ అయ్యాడు. దానిలో నకిలీ ఆపిల్ వాచ్ ఉంది. దీంతో బాధతో తిరిగి వెళ్తుండగా బైకుపై నిల్చున్న పునేష్‌ను గుర్తించాడు. వెంటనే కరుణాకరన్ ఇచ్చిన సమాచారం మేరకు అన్నానగర్ పోలీసులు వచ్చి పునేష్‌ను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. అనంతరం అతడి వద్ద విచారణ చేపట్టాడు. యాపిల్ వాచ్ కొనేంత డబ్బు తన దగ్గర లేదని, ఎలా కొనాలి అని ఆలోచిస్తున్నప్పుడు నకిలీ ఆపిల్ వాచ్ కొన్నట్టు తెలిపారు. డెలివరీ ఉద్యోగి రాగానే పార్సిల్ విప్పి, డూప్లికేట్ పెట్టి అతని దృష్టిని మళ్లించానని పునేష్ తెలిపాడు. ఆ తర్వాత అతడి నుంచి యాపిల్ వాచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment