సెంట్రల్‌జైలులో మరుగుదొడ్ల కొరత
● వేకువ జామున రెండు గంటల నుంచి క్యూలైన్ ● నిద్రాహారాలు మాని అనారోగ్యంతో ఖైదీల ఇబ్బందులు
పళ్లిపట్టు పాఠశాల హెచ్‌ఎం అరెస్టు
పళ్లిపట్టు: 3వ తరగతి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ నేరాల కింద పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాలు.. పళ్లిపట్టు ఆంజనేయనగర్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఇరుళ కుటుంబానికి చెందిన విద్యార్ధినిపై ఆ పాఠశాల హెచ్‌ఎం చంగల్వరాయన్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పళ్లిపట్టులో కలకలం రేపింది. సంఘటనకు సంబంధించి చిన్నారి తల్లి పళ్లిపట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి హెచ్‌ఎం చెంగల్వరాయన్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి పుళళ్ సెంట్రల్ జైలుకు తరలించారు.
వేలూరు: వేలూరు పేరు చెబితేనే గుర్తుకు వచ్చేది సెంట్రల్ జైలు మాత్రమే. తమిళనాడులోనే రెండో పెద్ద జైలైన వేలూరులో 1078 మంది విచారణ, శిక్ష పొందుతున్న వేర్వేరు ఖైదీలు ఉంటున్నారు. అయితే 60 మంది ఖైదీలు మాత్రమే ఉండాల్సిన ప్రాంతంలో మొత్తం 70 మంది ఖైదీలను ఉంచారు. దీంతో స్థలం లేక రాత్రి వేళల్లో ఖైదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు ఒక్కో ప్రాంతంలో మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. జైళ్లశాఖ నిబంధనల ప్రకారం జైలు ఖైదీలు వేకువ జామున 5.30 గంటలకే నిద్ర లేవాలి, అనంతరం నిద్రపోయిన వారిపై జైలు అధికారులు చర్యలు తీసుకుంటారు. గదుల వద్ద మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నందున ఖైదీలు ఉదయం చాలా సమయంలో క్యూలైన్‌లో వేచి ఉండి కాలకృత్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో జైలులోని ఖైదీలు వేకువ జామున 2 గంటలకే నిద్ర లేచి మరుగుదొడ్లు వద్ద క్యూలైన్‌లో నిలిచి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. వేకువ జామున 2 గంటలకే నిద్ర లేవడంతో ఖైదీలకు నిద్ర చాలడం లేదు. వృద్ధ ఖైదీలు నిద్రాహారాలు నిలిచి వెళ్లడంతో తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు. వీటిపై ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన ఒక ఖైదీ మాట్లాడుతూ వేలూరు సెంట్రల్ జైలులో ఖైదీలకు అవసరమైన మరుగుదొడ్లు లేవని తెలిపారు. ఉదయం 5.30 గంటలకే ఖైదీలు నిద్ర లేచి హాజరు కావాల్సిన పరిస్థితి ఉందన్నారు. వీటిపై అధికారులు విచారణ జరిపి ఖైదీలకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment