క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Wed, Nov 20 2024 12:41 AM | Last Updated on Wed, Nov 20 2024 12:41 AM

క్లుప

క్లుప్తంగా

టాస్మాక్‌ దుకాణం ముందు ఆందోళన

పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, అరెస్ట్‌

వేలూరు: వేలూరు పాత బస్టాండ్‌లోని టాస్మాక్‌ దుకాణాన్ని మూయించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఏయుమలై అద్యక్షతన కార్యకర్తలు దుకాణానికి తాళం వేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త, పాత బస్టాండ్‌లోని సుమారు 5 టాస్మాక్‌ దుకాణాలను మూసి వేయాలని వీటి వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాత్రి వేళల్లో మహిళలు బస్టాండ్‌కు రావాలంటే భయాందోళన చెందుతున్నారని ఆరోపించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు చేసేది లేక కార్యకర్తలను అరెస్ట్‌ చేసి ప్రైవేటు కళ్యాణ మండపంలో ఉంచారు. ఈ ధర్నాలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సరోజ, పట్టణ కార్యదర్శి సింబుదేవన్‌ తదితరులు పాల్గొన్నారు.

లారీ చక్రంలో చిక్కుకుని మహిళ మృతి

అన్నానగర్‌: చైన్నె సమీపంలోని కోవిలంపాక్కం కలైనార్‌ రోడ్డుకు చెందిన ధనభాగ్యం (45). ఆమె ఇంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం నార్త్‌బౌండ్‌ రోడ్డు నుంచి మేడవాక్కం మెయిన్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద రోడ్డు దాటుతుండగా.. లారీ ధనభాగ్యంను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రాజరాజ చోళుని కాలం నాటి రాగి నాణెం లభ్యం

అన్నానగర్‌: కడలూరు జిల్లాలోని పన్రూట్టి అదుతు ల్లా ఉలుంతంప ట్టు తెన్‌ పెన్నా నదీ తీరంలో పు రావస్తు శాస్త్రవేత్త ఇమ్మాన్యుయేల్‌ మెల్‌ ఫీల్డ్‌ సర్వే చేపట్టారు. ఈ స మయంలో పురాతన రాగి నాణెం బయల్పడింది. ఇది దేవనాగరి లిపిలో ‘శ్రీ రాజరాజ’’అని చెక్కిన రాజరాజ చోళుడి కాలం నాటి నాణెం అని తేలింది. కాగా ఉలుంతంపట్టులో లభించిన ఈ రాగి నాణెం ఇప్పటివరకు లభించిన నాణేల్లో పరిమాణంలో చిన్నదని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయండి

తిరువళ్లూరు: మరుగుదొడ్లు నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి రుణాలు పొందిన వారు వెంటనే పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ప్రభుశంకర్‌ సూచించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా స్వచ్భ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ టాయిలెట్స్‌ డేను నిర్వహించారు. ఈ సందర్బంగా విష్ణువాక్కంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ ప్రభుశంకర్‌ హాజరై ప్రసంగించారు. మరుగుదొడ్లు నిర్మాణాల కోసం ప్రభుత్వం నుంచి రుణాలు పొందిన వారు వెంటనే పనులను పూర్తీ చేయాలని ఆదేశించారు. అనంతరం స్వచ్చ భారత్‌పై ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్‌ జయకుమార్‌, బీడిఓ రవితో పాటు పలువురు పాల్గొన్నారు.

వండలూర్‌ జూలో హిప్పోపొటామస్‌ జననం

తిరువొత్తియూరు: వండలూరు, జూలాజికల్‌ పార్కులో 5 ఆడ హిప్పోలు, 2 మగ హిప్పోలను సంరక్షిస్తున్నారు. ఈక్రమంలో ప్రక్ష్‌ కుర్ది అనే ఆడ నీటి ఏనుగు 8 నెలలు గర్భిణిగా ఉన్న క్రమంలో ఆగస్టు 21న ప్రసవించింది. తల్లి పిల్లను వేర్వేరుగా పరిరక్షిస్తున్నారు. ఈక్రమంలో ఆడ హిప్పో పిల్ల పుట్టిన 8వ రోజున అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అలాగే మరో ఆడ నీటి ఏనుగు రెండు రోజుల క్రి తం పిల్లకు జన్మనిచ్చింది. పార్కు నిర్వాహకులు నిరంతరం వీటిని పర్యవేక్షిస్తున్నారు.

చైన్నె ఫ్లవర్‌ షోకు ముమ్మర ఏర్పాట్లు

కొరుక్కుపేట: చైన్నెలో జరిగే పూల ప్రదర్శనకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇందుకోసం ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో పూలకుండీలను సిద్ధం చేస్తున్నారు. నీలగిరిజి ల్లాలోని ఊటీలో ఏటా వేసవి కాలంలో పూల ప్రదర్శన నిర్వహించారు. కొడైకెనాల్‌లోని బ్రయంట్‌ పార్క్‌లో ఫ్లవర్‌ షో కూడా జరుగుతోంది. ఇప్పుడు చైన్నెలోని సెమ్మెలీ పార్క్‌లో కూడా వార్షిక పూల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. చైన్నెలో పూల ప్రదర్శన కోసం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఉద్యానవన శాఖ వారు తోటలోని పూల మొక్కలను సిద్ధం చేసి చైన్నెకి తరలించి అలంకరించనున్నారు. ఇందుకోసం తమిళనాడులోని అన్ని పార్కుల్లో పూల కుండీలను సిద్ధం చేసే పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం నీలగిరి జిల్లా ఊటీలోని బొటానికల్‌ గార్డెన్‌లో పూల కుండీలను సిద్ధం చేసే పని కూడా ప్రారంభించారు. నీలగిరి జిల్లాలో లక్ష పూల కుండీల తయారీ పనులు శరవేగంగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement