ఆర్థిక సంఘ సభ్యుల విస్తృత పర్యటన
సాక్షి, చైన్నె : ఆర్థిక సంఘం బృందం మంగళవారం చైన్నె శివారులలో విస్తృతంగా పర్యటించింది. నెమ్మేలి నిర్లవణీకరణ ప్రాజెక్టును సందర్శించారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, సభ్యులుు అజయ్ నారాయణ్, అనీ జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్, అఽధికారులతో భేటీ తొలి రోజున జరిగింది. మంగళవారం ఈ బృందం ఈసీఆర్ మార్గంలోని నెమ్మెలిలో ఇటీవల పూర్తిచేసిన నిర్లవణీకరణ ప్రాజెక్టును సందర్శించింది. ఇక్కడ నీటి శుద్ధీకరణ ప్లాంట్‌లు, సముద్రం నుంచి నీటి తరలింపు, ఇక్కడి నుంచి చైన్నెనగరం వైపుగా నీటిని సరఫరా చేసేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులు ఈ బృందానికి వివరించారు. ఇక్కడి నీరు ఎంత మందికి ఉపయోగకరంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు వెచ్చించిన మొత్తం తదితర అంశాలపై అధ్యయనం చేసింది. అక్కడి నుంచి నేరుగా శ్రీపెరంబదూరు పారిశ్రామికవాడకు చేరుకుని ఇక్కడి పారిశ్రామిక ప్రగతిని అధ్యయనం చేశారు. ఫాక్స్‌కాన్ పరిశ్రమ, మొబైల్ విడి భాగాల తయారీ పరిశ్రమ, ఎగుమతి కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, ఆసియాలోనే వర్కింగ్ ఉమెన్స్ కోసం ఇక్కడ నిర్మించిన బహుళ అంతస్తుల తరహా హాస్టల్‌ను పరిశీలించారు. ఇక్కడ బస చేసి ఉన్న మహిళలకు కల్పించిన సౌకార్యలు, భద్రతను పరిశీలించారు. 18 వేల మంది ఇక్కడ బస చేసి ఉన్న సమాచారంతో విస్మయం చెందారు. అక్కడి నుంచి చైన్నె కు చేరుకున్న ఈ బృందం సాయంత్రం మదురైకు విమానంలో బయలు దేరి వెళ్లింది. అక్కడి నుంచి కారులో రామేశ్వరానికి వెళ్లారు. బుధవారం రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలోపూజల అనంతరం తంగచ్చి మండపానికి వెళ్లనున్నారు. ఇక్కగ పీఎం గృహ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. రామనాథపురం నగర పాలక సంస్థలో జరిగే కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. కిలడి పురావస్తు పరిశోధన ప్రదేశానికి వెళ్లనున్నారు. తర్వాత మదురైకు చేరుకుంటారు. అనంతరం మదురై నుంచి ఈ బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment