ఇంటి స్థలాల కోసం కలెక్టరేట్ ముట్టడి
తిరువళ్లూరు: 24 సంవత్సరాల క్రితం కేటాయించిన స్థలాన్ని సర్వే చేసి తమకు అప్పగించాలని కోరుతూ ఊత్తుకోట తాలూకా మెయ్యూరు గ్రామానికి చెందిన ప్రజలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా మెయ్యూరు గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు 183 మందికి మూడు సెంట్లు చొప్పున 2000 సంవత్సరంలో ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇందు కోసం సమీపంలోని ప్రభుత్వ భూమిని చూపించారు. అయితే ఇంత వరకు భూమిని సర్వే చేసి లబ్ధిదారులకు అప్పగించలేదు. ఇదే అంశంపై పలుసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోడీఆర్ఓ రాజ్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు. తమ ఇంటి స్థలాలను వెంటనే సర్వే చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment