– రూ.4.75 కోట్ల మోసం చేసిన బీజేపీ
నాయకుడు, భార్య అరెస్ట్
అన్నానగర్: తిరుచ్చిలో నకిలీ పత్రాలు తయారు చేసి భూమిని విక్రయించి రూ.4.75 కోట్లు మోసం చేసిన బీజేపీ నాయకుడు, అతడి భార్యను గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. తిరుచ్చిలోని శ్రీరంగానికి చెందిన కె.వి. రంగసామి వ్యాపారవేత్త. ఇతనికి ఆ ప్రాంతంలో 17 ఎకరాల తోట ఉంది. చైన్నెలో నివాసం ఉండడంతో తోట నిర్వహణ బాధ్యతను శ్రీరంగానికి చెందిన గోవిందన్ (57)కు అప్పగించాడు. ఇలా గత కొన్నేళ్లుగా గోవిందన్ తోటను నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో శ్రీరంగానికి చెందిన దేవరాజన్ (50) రెండేళ్ల క్రితం గోవిందన్‌ను కలిశాడు. వారు తరచూ కలుసుకుని మాట్లాడుకునేవారు. అప్పుడు గోవిందన్ ఈ ఆస్తి తనదేనని, అమ్మబోతున్నానని, మంచి వ్యక్తి ఉంటే తీసుకురావాలని చెప్పాడు. దీంతో దేవరాజాన్ ఎస్టేట్‌ను తానే కొనుగోలు చేస్తానని చెప్పడంతో గోవిందన్ బేరం కుదుర్చుకుని నకిలీ పత్రాలు ఇచ్చాడు. ఇది నమ్మి దేవరాజన్ రూ.4.75 కోట్లను గోవిందన్‌కు పలు విడతలుగా అందించారు. చివరికి నకిలీ పత్రాలు అని తేలడంతో దేవరాజన్ బుధవారం తిరుచ్చి మున్సిపల్ క్రైం బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి ఈ మోసానికి పాల్పడిన గోవిందన్‌ను, అతని భార్యను గురువారం ఉదయం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన గోవిందన్ బీజేపీ స్థానిక విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడని, అతడు భూమి యజమాని పేరుతో నకిలీ పత్రాలు సిద్ధం చేశాడని, ఇందుకు తోడుగా ఉన్న అతని భార్య గీతా(30) ఉన్నట్లు తెలిసింది. అనంతరం భార్యాభర్త లిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment