జైలు నుంచి కస్తూరి విడుదల
సాక్షి, చైన్నె: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన సినీ నటి కస్తూరి బెయిల్ దక్కడంతో జైలు నుంచి గురువారం సాయంత్రం విడుదలయ్యారు. ఈ కేసులో శనివారం హైదరాబాద్‌లో అరెస్టయిన కస్తూరిని చైన్నె పుళల్ జైలులో బంధించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసుకున్న విజ్ఞప్తికి ఎగ్మూర్ కోర్టు స్పందించింది. నిబంధనలతో ఆమెకు బెయిల్‌ను బుధవారం మంజూరు చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల డాక్యుమెంట్లు ఆ జైలు వర్గాలకు గురువారం అందాయి. దీంతో జైలు నుంచి ఆమె సాయంత్రం విడుదలయ్యారు. ఆమెకు పలువురు శాలువ కప్పి ఆహ్వానించారు. తనకు సహకారం అందించిన వారందరికి కృతజ్ఞతులు అంటూ, చివరకు ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు సైతం కృతజ్ఞతులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment