సిద్ధం!
సాగర విహారానికి
44వ క్షేత్రం..
ఉత్తర కేశమంగైలో మంగలేశ్వరి సమేత మంగళనాథర్‌గా శివాలయం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఏక శిల్పంగా మరగద నటరాజ ఆలయం కనిపిస్తుంటుంది. 108 వైష్ణవ దివ్య దేశాలలో 44వ క్షేత్రంగా తిరుపుల్లాని ఆదిజగన్నాథర్ ఆలయం, దేవీ పట్నం నవపాశానం, ఏర్వాడి దర్గా, ధనుష్కోటి పురాతన చారిత్రక సంపదలు. అరిచల్ మునై బీచ్, కుందుకాల్ వివేకానంద మండపం, గురుసడై తీవు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారకంలు ఇక్కడే ఉన్నాయి. మండపం నుంచి పాంబన్ – రామేశ్వరం వరకు చేపల హార్బర్ ఉంది. తయిళపాడేలో సుమారు 1,076 కి.మీ దూరం ఉన్న సముద్ర తీరంలో మూడో వంతు భాగం తీరం ధనుస్కోటి నుంచి కన్యాకమారి వరకు విస్తరించి ఉంది. ధనుస్కోటిని పాక్ జలసంధిగా పిలవడం జరుగుతోంది. నాగపట్నం నుంచి రామనాథపురం సముద్ర తీరం వరకు ఇది వర్తిస్తుంది. ఇక్కడ పాండియ రాజులు, చోళ రాజులు, నాయకర్‌లు, సేతుపతి మన్నర్‌ల హయాంలో శ్రీలంక , మలేషియా వంటి దేశాలతో పాటు ఐరోపియన్ దేశాలకు తొండిదేవిపట్నం, పెరియపట్నం, కీలకరై, రామేశ్వరం మీదుగా సముద్ర వర్తకం జరిగేది.
సాక్షి, చైన్నె : రామనాథపురం జిల్లాకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక భూమిగా గుర్తింపు ఉంది. పురా తన చిహ్నాలు, శిల్పాలు సముద్ర సంపదకు ఈ ప్రాంతం నెలవు. భారత దేశంలో చిట్టచివరి భూ భాగమైన రామేశ్వరం ఈ జిల్లాలోనే ఉంది. ఇక్కడికి కూతవేటు దూరంలోనే శ్రీలంక దేశం ఉంది. ఒకప్పుడు రామేశ్వరం నుంచి శ్రీలంకకు నౌకాయానం జరిగేది. ఐదు దశాబ్దాల క్రితం సముద్రం ఉప్పొంగడంతో ఇక్కడి ధనుష్కోటి దీవి గల్లంతైంది. ఇక్కడ ప్రస్తుతం పురాతన శిథిల కట్టడాలు కనిపిస్తుంటాయి. అలాగే రామనాథపురంలోని రామనాథ స్వామివారిని దర్శించుకునేందుకు, ఇక్కడి పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా సందర్శకులు త రలి వస్తుంటారు.
అత్యంత పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఈ జిల్లాలో సుందర ప్రదేశాలు ఎన్నో. పాంబన్ రైల్వే వంతెన మీదుగా సముద్రంలో రామేశ్వరానికి రైలు ప్రయాణం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం పురాతన మార్గానికి బదులుగా కొత్త రైల్వే మార్గం ముస్తాబైంది. ఇక్కడికి కూతవేటు దూరంలో గురుసడై దీవులకు పడవ సవారీ, సముద్ర తీరంలో వినోదాన్ని అందించే పార్కు, కోమారీసన్ దీవులకు పడవ సవారి మరింత ఆనందాన్ని కలిగిస్తుంది.
నౌకాయానం..
రామనాథపురంలోని దేవీపట్నం పురాతన సముద్ర తీర గ్రామం, ఇక్కడ ముత్యాలు, శంఖం, గవ్వలు వర్తకం ఎక్కువగా జరుగుతుంటుంది. 18,19 శతాబ్దాలలో దేవీ పట్నం ఉత్తమ వర్తక నగరంగా ఉండేది. అప్పట్లో తొండి నాడుగా పిలవబడే మదురైకు సముద్ర ముఖ ద్వారంగా ఈ నగరం ప్రసిద్ధి చెందింది. దేవిపట్నంలో ఉన్న పురాతన హార్బర్ ప్రస్తుతం చేపల హార్బర్‌గా మారింది. ఇక్కడ నవ పాశానం ఉండడం. అది ఆధ్యాత్మిక ప్రదేశంగా ప్రసిద్ధి చెంది ఉండటంతో భక్తులు, పర్యాటకుల కోసం చిన్న చిన్న నౌకలను నడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. సముద్ర విహారంగా దేవీ పట్నం నుంచి పాంబన్ – రామేశ్వరం కలుపుతూ 100 చిన్న నౌకలను నడి కలిపే విధంగా చర్యలకు సిద్ధమయ్యారు. ఈ మార్గంలో మూడు గంటల సముద్ర విహార సమయం పట్టనుంది. ఇప్పటికే ఈ సముద్ర విహారం నిమిత్తం చిన్న నౌకల సంస్థల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. సముద్ర యానానికి సంబంధించి దేవిపట్నం – పాంబన్ – రామేశ్వరం మధ్య రాడార్‌లు ,జీపీఎస్‌లతో కూడిన అత్యాధునిక పరికరాలను అమర్చే దిశగా పరిశీలనలు వేగవంతం చేశారు. 2025 మార్చి లేదా ఏప్రిల్‌నెలలో ఈ మార్గంలో సముద్ర వివాహారానికి కసరత్తుల్లో వేగాన్ని పెంచారు. ఇందుకు వచ్చే స్పందన ఆధారంగా రామనాథపురం దీవులు శాయల్‌కుడి మీదుగా వేంబార్ (తూత్తుకుడి జిల్లా) వరకు విస్తరణ ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం. అలాగే సముద్ర సంపదల సంరక్షణనిలయగా ఉన్న మన్నర్ వలి గుడ దీవులను కలిపే విధంగా ముందుకు సాగే యోచనలో ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం నాగపట్నం నుంచి శ్రీలంక కాంగేశం వరకు నౌకాయనం సాగుతోంది. అలాగే కన్యాకుమారి తీరం నుంచి సముద్రంలో కూత వేటు దూరంలో ఉన్న వివేకానంద రాక్ వరకు పూంబుహార్ పడవల విహారం సాగుతోండడం గమనార్హం.
ధనుష్కోటి బీచ్
దేవీపట్నం టూ రామేశ్వరం వయా పాంబన్
చిన్న నౌకలను నడిపేందుకు కార్యాచరణ సిద్ధం
2025 మార్చి తర్వాత సేవలు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment