సంతానం లేదని దంపతుల ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సంతానం లేదని దంపతుల ఆత్మహత్య

Published Sat, Nov 23 2024 12:18 AM | Last Updated on Sat, Nov 23 2024 12:18 AM

-

మదురై, తిరుమంగళం సమీపంలో దారుణం

సేలం: పిల్లలు లేరని మదురై జిల్లా తిరుమంగళం సమీపంలో భార్యాభర్త విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలో ఉన్న ఎ.తొట్టియపట్టి గ్రామానికి చెందిన నిత్యానందం(65), అతని భార్య ఆవుడయమ్మాల్‌(56). నిత్యానందం మాజీ కో–ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడిగా, డీఎంకే శాఖా కార్యదర్శిగా ఉన్నారు. కొన్నేళ్లుగా వీరికి పిల్లలు లేరు. ఈ స్థితిలో గురువారం రాత్రి ఇంటి ముందు ఆవుడయమ్మాల్‌, నిత్యానందం ప్పటి లాగే ఇరుగు పొరుగు వారితో సహజంగా మాట్లాడారు. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన పాల వ్యాపారి ఎంత సేపు పిలిచినా చప్పుడు కాకపోవడంతో సందేహించి లోపలికి వెళ్లి చూశారు. గదిలో నిత్యానందం, ఆవుడయమ్మాల్‌ స్పృహ తప్పిన స్థితిలో పడి కనిపించారు. వారి సమీపంలో పురుగుల మందు బాటిల్‌ కనిపించింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని పరీక్షించగా అప్పటికే నిత్యానందం మృతి చెందినట్టు తెలిసింది. ప్రాణాలతో ఉన్న ఆవుడయమ్మాల్‌ను హుటాహుటిన తిరుమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి వెళ్లిన కొంత సేపటికి ఆవుడయమ్మాల్‌ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న తిరుమంగళం పోలీసులు వారి మృతదేహాలను శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు జరిపిన విచారణలో పిల్లలు లేకపోవడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement