తిరువొత్తియూరు: తాంబరం ప్రాంతానికి చెందిన సుబిత(46) తన అక్క కుమారుడి ఆపరేషన్ కోసం రూ.3 లక్షలు అవసరం కావడంతో ఓ బ్యాంకులో గురువారం డబ్బులు డ్రా చేసి తీసుకున్నారు. తరువాత సోదరుడు లూర్దురాజ్(50)తో కలిసి ఆటోలో తాంబరం నుంచి అమైందకరై వెళ్లారు. సుబిత ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రెస్టారెంట్‌లో భోజనం తీసుకోవాలని వెళ్లారు. లూర్దురాజ్ ఆటోలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఆటో వెనుక 500 రూపాయల నోటు పడి ఉంది, అది నీదేనా అని అడిగారు. దీంతో లుర్దురాజ్ ఆతృతగా ఆటో దిగి డబ్బులు తీసుకున్నాడు. తిరిగి ఆటో వద్దకు వచ్చిన తర్వాత డబ్బుల బ్యాగ్ కనిపించకపోవడంతో దిగ్భ్రాంతి చెందాడు. తన దృష్టి మరల్చి రూ.3 లక్షల చోరీ చేసినట్టు గ్రహించాడు. రెస్టారెంట్‌లో భోజనం తీసుకుని సుబిత ఆటో వద్దకు వచ్చింది. లూర్దురాజ్ నగదు చోరీ అయిందని ఏడ్చాడు. సుబితా విచారణ చేయగా రూ.500 ఎర చూపి రూ.3 లక్షలు చోరీ చేశారని గ్రహించారు. దీనిపై సుబిత అమైందకరై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాంబరంలోని బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తూ వచ్చి నగదు చోరీ చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment