అన్నానగర్: రెడ్‌హిల్స్ బైపాస్ రోడ్డులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది. గురువారం సాయంత్రం పని ముగించుకున్న ఉద్యోగులు యథావిధిగా బ్యాంకుకు తాళం వేశారు. ఈ బ్యాంకులో సెక్యూరిటీ గార్డు లేడు. ఈ క్రమంలో ఓ యువకుడు అర్ధరాత్రి కిటికీ పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నగలు–మనీ లాకర్ ప్రాంతానికి వెళ్లగా, అలారం మోగింది. దీంతో షాక్‌కు గురైన దొంగ బ్యాంకు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే బయటకు రాలేక బ్యాంకులో చిక్కుకుపోయాడు. ఇంతలో బ్యాంకులో అలారం మోగింది. షాక్ తిన్న ఇరుగుపొరుగు వారు రెడ్‌హిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన విచారణ చేపట్టారు. అప్పుడు దొంగ బ్యాంకులో చిక్కుకున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగులను పిలిపించి పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ గదిలో దాక్కున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వీరాపురం ప్రాంతానికి చెందిన సురేష్(49) అని తేలింది. యాక్సా బ్లేడుతో కిటికీ కడ్డీలు కోసి బ్యాంకులోకి దూకాడు. అయితే అలారం మోగడంతో బ్యాంకు నుంచి దూకలేక చిక్కుకుపోయినట్లు తెలిసింది. బ్యాంకు దోపిడీ యత్నంలో సురేష్ ఒక్కడికే సంబంధం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి అతనితోపాటు ఎవరైనా సహచరులు వచ్చి ఉండవచ్చని, అలారం మోగడంతో పారిపోయి ఉండవచ్చనే కోణంలో అతనితో విచారణ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి బ్యాంకు, సమీపంలోని నిఘా కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన రెడ్‌హిల్స్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment