తిరువొత్తియూరు: మెథా బెటమైన్ విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె చూళైమేడు పెరియర్ పాలెం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒకరిని పోలీసులు పట్టుకుని విచారణ చేశారు. ఐటీ విభాగంలో పనిచేస్తున్న అతను అతను బెంగళూరు నుంచి మెథాబెటమైన్ మత్తు పదార్థాలు తీసుకువచ్చి చైన్నె అమైందకరై, చూలైమేడు ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆరంబాకం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి మెథాబెటమిన్ విక్రయిస్తున్న అభిత్‌రాజ్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 4 గ్రాముల మెథాబెటమైన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.
ప్రభుత్వ కొలను ఆక్రమణ
● బీజేపీ నాయకుడిపై ప్రజల ఫిర్యాదు
తిరువొత్తియూరు: షోలింగనల్లూరులో ప్రభుత్వానికి చెందిన కొలనును ఆక్రమించిన బీజేపీ ప్రముఖుడిపై ప్రజలు ఫిర్యాదు చేశారు. చైన్నె కార్పొరేషన్ 15వ మండలం 198వ వార్డుకు సంబంధించిన కారపాకం ప్రాంతంలో పెద్ద కొలను ఉంది వర్షాకాలంలో ఇక్కడ నీరు నిల్వ ఉంటుంది. ఈ కొలను నీరు స్థానిక ప్రజలకు ఆధారంగా ఉంది. ఈ క్రమంలో 198వ వార్డు కౌన్సిలర్, బీజేపీ ప్రముఖుడు ఆలయ అభివృద్ధి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుందరం ఈ కొలనును ఆక్రమించినట్లు తెలిసింది. దీనిపై స్థానిక ప్రజలు గురువారం షోలింగనల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
మంత్రి పెరియకరుప్పన్‌కు ఊరట
సాక్షి, చైన్నె: సహకార మంత్రి పెరియకరుప్పన్‌కు ఎన్నికల కేసు నుంచి ఊరట కలిగింది. ఆయనపై దాఖలైన కేసును హైకోర్టు రద్దు చేసింది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో శివగంగై జిల్లా తిరుపత్తూరు నుంచి డీఎంకే అభ్యర్థిగా కేఆర్ పెరియకరుప్పన్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో మంగళం గ్రామంలో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పెద్ద గొడవే జరిగింది. ఎన్నికల అధికారులు పెరియకరుప్పన్‌తో పాటుగా 8 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు శివగంగై కోర్టులో విచారణలో ఉంది. ప్రస్తుతం పెరియకరుప్పన్ సహకార మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల గొడవతో తనకు సంబంధం లేదని, ఆ సమయంలో తాను మరో ఊరిలో ప్రచారంలో ఉన్నట్టు, ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. వాదనల అనంతరం ఈ కేసును రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల కేసు నుంచి మంత్రి పెరియకరుప్పన్‌కు ఊరట కలిగినట్టైంది.
Comments
Please login to add a commentAdd a comment