అడవిలో చిక్కుకున్న భక్తులు
● రక్షించిన విపత్తుల బృందం
సేలం: శబరిమలకు వెళ్లే మార్గంలో గురువారం రాత్రి చైన్నెకి చెందిన ముగ్గురు భక్తులు దట్టమైన అటవీప్రాంతంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న విపత్తుల బృందం, పోలీసులు, అటవీశాఖ అధికారులు వారిని రక్షించి ఆలయానికి తీసుకొచ్చారు. శబరిమల దర్శనం కోసం పుల్‌మేడు అడవి మార్గంగా అనేక మంది భక్తులు వెళుతుంటారు. ఇడిక్కి జిల్లా వండిపెరియార్ నుంచి 10 కిలోమీటర్లకు పైగా అటవీమార్గంగా శబరిమలకు నడిచి వెళ్లాల్సి ఉంది. ఈ మార్గంలో భక్తుల సహకారం కోసం అక్కడక్కడ సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో గురువారం చైన్నెకి చెందిన లక్ష్మణన్ (40), కోటీశ్వరన్ (40), వరుణ్ (20) పుల్‌మేడు మార్గంగా ఆలయానికి వెళుతున్నారు. అప్పుడు లక్ష్మణన్, కోటీశ్వరన్, వరుణ్ అనారోగ్యం కారణంగా వెనుకపడిపోయారు. తర్వాత వారు దారి తెలియక అడవిలోకి వెళ్లిపోయారు. ముందు వెళ్లిన వారు చాలా సేపటి వరకు ముగ్గురు రాకపోవడంతో అనుమానించి పోలీసులకు సమాచారం ఇంచ్చారు. దీంతో పోలీసులు, విపత్తుల బృందం, అటవి శాఖ అధికారులు, కలిసి ఆ ప్రాంతంలో దట్టమైన అడవిలో గాలించి ముగ్గురిని రక్షించి సన్నిధానానికి తీసుకెళ్లారు. అనంతరం వారికి అక్కడ చికిత్స అందించి, వారిని దర్శనానికి పంపించారు. తర్వాత వారు శుక్రవారం చైన్నెకి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment