అన్నానగర్: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలరి మృతిచెందిన ఘటన మత్స్యకారులను కలచివేసింది. నాగపట్నం జిల్లా అక్కరాయపేటకు చెందిన అళగిరిసామి. ఇతనికి సొంతమైన పడవలో గత 18న అక్కరాయపేట టాటానగర్కు చెందిన బాలాజి (41) సహా 10 మంది చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వారు సముద్రం మధ్యలో చేపల వేటలో నిమగ్నమై ఉన్నారు. ఈక్రమంలో గురువారం అర్ధరాత్రి, 20 మంది జాలర్లు కొడియాకరై సమీపంలో చేపలు పడుతుండగా ఒక్కసారిగా బాలాజి పడవలో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే తోటి మత్స్యకారులు లేపేందుకు ప్రయత్నించారు. కానీ అతను స్పృహలో నుంచి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు చేరుకున్నారు. బాలాజీని నాగై ఒరత్తూరు వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment