సీవీ రామన్ పరిశోధనలు స్ఫూర్తిదాయకం
తిరువళ్లూరు: సర్ సీవీ రామన్ పరిశోధనలు భావితరాల శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమని విప్రో రీజినల్ హెడ్ ఆనందకృష్ణన్ దేవరాజ్ అన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ సీవీరామన్ జయంతిని పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లా అరణ్‌వాయల్‌కుప్పంలోని ప్రత్యూష ఇంజినీరింగ్ కళాశాలలో నేషనల్ సైన్స్ ఫెయిర్ ప్రయోగ–2024 పేరిట ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఈ ఫెయిర్‌కు వివిధ జిల్లాల నుంచి 2,500 మంది విద్యార్థులు పాల్గొని సృజనాత్మకతతో కూడిన నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి కళాశాల అధ్యక్షుడు రాజారావ్, ప్రిన్సిపల్ ఆర్‌ఎస్ కుమార్ హాజరయ్యారు. కళాశాల సీఈఓ ప్రత్యూష, వైస్‌చైర్మన్ చరణ్‌తేజ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా విప్రో రీజినల్ హెడ్ ఆనందకృష్ణన్ దేవరాజ్ హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శనలో వుంచిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం రంగాలకు చెందిన 300 ప్రాజెక్టుల ప్రయోగాల నమూనాలను పరిశీలించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పరిశోధనలకు సర్టిఫికెట్‌తోపాటు రూ.50వేల విలువ చేసే బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment