కొరుక్కుపేట: అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ మామ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఆయన బంధువులకు చెప్పడంతో బయటపడ్డారు. చైన్నె కొట్టూరుపురంలోని వెల్దియన్ వీధిలో నివాసం ఉంటున్న ఆనంద్ (81). ఇతను వ్యాపార వేత్త. చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనందన్‌కు మామ. ఈనెల18న వాట్సాప్ నంబర్‌లో తనను సంప్రదించిన గుర్తు తెలియని వ్యక్తి తాను కర్ణాటక రాష్ట్ర పోలీసునని, మీ ఆధార్ నంబర్‌తో తీసుకున్న అద్దె కారు జనంలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురయ్యారని బెదిరించి, మీ అకౌంట్‌లో ఉన్న నగదును వెంటనే నాకు ట్రాన్స్‌ఫర్ చేయాలని బెదిరించాడు. దీంతో షాక్‌కు గురైన ఆనంద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment