తిరువొత్తియూరు: పుళల్ సమీపం, అమ్మన్ ఆలయంలో నగలు చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పుళల్ బుద్ధగరము విగ్నేశ్వరనగర్‌లో అంకాల పరమేశ్వరి అమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయ ధర్మకర్త బుద్ధగరముకు చెందిన ప్రకాష్ (42). ఇతను గత 16వ తేదీ ఆలయ పూజలు తర్వాత తాళం వేసుకుని ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఆలయానికి వెళ్లి చూడగా తలుపులు పగలగొట్టబడి ఉన్నాయి. అమ్మన్ విగ్రహంపై ఉన్న 4 సవర్ల తాళి చైన్ అదృశ్యమైనట్టు గుర్తించారు. దిగ్భ్రాంతి చెందిన ప్రకాష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి చోరీకి సంబంధించి మధురవాయల్ చెందిన సెల్వన్ (35), మడిపాక్కంకు చెందిన మురుగన్ (38)లను అరెస్టు చేశారు. పట్టుబడిన ఇద్దరు చైన్నె పరిసర ప్రాంతంలో పలుచోట్ల చోరీ, దారి దోపిడీ చేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment