సమస్య పరిష్కరిద్దాం
దర్శక, రచయితల
తమిళసినిమా: నటుడు ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జాలియో జింఖానా. నటి మడోనా సెబాస్టియన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ట్రాన్సిండియా మీడియా పతాకంపై రాజన్, నీలా కలిసి నిర్మించారు. శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి అభిరామి, యోగి బాబు, రోబో శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గణేశ్ చంద్ర ఛాయాగ్రహణం, అశ్విన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత రాజన్ మాట్లాడుతూ తాను నిర్మించిన నాలుగో చిత్రం జాలియో జింఖానా అని చెప్పారు. ఈ మల్టీ స్టారర్ కథా చిత్రం జనరంజకంగా ఉంటుందని తెలిపారు. దర్శకుడు శక్తి చిదంబరం మాట్లాడుతూ ఇది డెడ్ బాడీ చుట్టూ తిరిగే కథా చిత్రమన్నారు. డెడ్ బాడీగా ప్రభుదేవా నటించడానికి అంగీకరించడం తనకే ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆయన చుట్టూ నాలుగు కథానాయికలు ఉంటారన్నారు. వారు చేసే కామెడీ హంగామాను భరిస్తూ ప్రభుదేవా నటించారన్నారు. దీనికి స్క్రీన్‌ప్లే రాయడం అంత సులభం కాదన్నారు. చిత్రం చాలా బాగా వచ్చిందని తెలిపారు. నటుడు ప్రభుదేవా మాట్లాడుతూ ఈ కథను నిర్మించడానికి నిర్మాతకు ధైర్యం కావాలన్నారు. అందుకు నిర్మాత రాజన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. దర్శకుడు శక్తి చిదంబరం తన మిత్రుడనీ, ఇంత మంచి పాత్రలో నటించే అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు అన్నారు. సాంకేతికవర్గం అంతా బాగా పని చేశారన్నారు. దర్శకుడు శక్తి చిదంబరం, గీత రచయితల మధ్య సమస్య గురించి తనకు ఇప్పుడే తెలిసిందని, దాన్ని పరిష్కరిద్దామని ప్రభుదేవా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment