క్లుప్తంగా
32 దుకాణాల కూల్చివేత
తిరువళ్లూరు: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 32 దుకాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నీటి ఆధారిత ప్రాంతాల్లోని కట్టడాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమ కట్టడాలను గుర్తించి తొలగిస్తున్నారు. ఇటీవల తిరువేర్కాడు మున్సిపాలిటీలో 1,200 నివాసాలకు నోటీసులు జారీ చేసి కొన్నింటిని తొలగింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో కడంబత్తూరు యూనియన్ పేరంబాక్కంలో 32 అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించారు. వీటిని కూల్చివేయడానికి అధికారులు 21 రోజులకు ముందుగానే నోటీసులు జారీ చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల బందోబస్తు నడుమ పేరంబాక్కంలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈసమయంలో బాధితులు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది. అయితే ఉద్రిక్తత పరి స్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
చేతులు మారిన
రూ.40 లక్షలు
కొరుక్కుపేట: ప్రభుత్వ భూముల అక్రమ వ్యవహారంలో రౌడీ సీసింగ్ రాజాకు రూ.40 లక్షలు ముట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. చిట్లపాక్కంలోని రౌడీ సీసింగ్ రాజా ఇటీవల బోలాస్ ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపబడ్డాడు. తాంబరం, దాని పరిసర ప్రాంతాలలో అక్రమాలకు, ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రౌడీ సీసింగ్ రాజా, అతని సహచరులు, బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఆయా స్థలాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో భూమికి సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. సైలెయూర్ సమీపంలోని ప్రభుత్వ అన్యాక్రాంతమైన భూమిగా పత్రాలను నకిలీ పత్రాలు తయారు చేసి మోసం చేయడంలో ఓ సంస్థకు సహకరించిన సీసింగ్ రాజాకు రూ.40 లక్షలు చేతులు మారినట్లు సంచలన సమాచారం.
పోలీసుల విచారణలో
సంచలన సమాచారం
Comments
Please login to add a commentAdd a comment