విద్యార్థుల ఘర్షణ
పళ్లిపట్టు: పొదటూరుపేట బస్టాండులో పాఠశాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పళ్లిపట్టు సమీపం పొదటూరుపేటలోని ప్రభుత్వ బాలుర, బాలికల మహాన్నత పాఠశాలల్లో రెండు వేలకు పైగా బాల, బాలికలు చదువుకుంటన్నారు. పొదటూరుపేట పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు బస్సులు, సైకిళ్లు, నడిచి వెళ్లి చదువుకుంటున్నారు. ఈక్రమంలో ఇటీవల కాలంలో బస్సుల్లో ప్రయాణం చేసే విద్యార్థుల మధ్య గొడవలు చోటుచేసుకుని ఘర్షణకు దారితీస్తున్నాయి. ఈక్రమంలో బుధవారం ఉదయం కీచ్చళం, నెడిగళ్లు గ్రామాలకు చెందిన విద్యార్థుల్లో బస్సులో ఫుట్‌బోర్డు ప్రయాణానికి సంబంధించి గొడవలు చోటుచేసుకున్నాయి. దీంతో రెచ్చిపోయిన విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి బస్టాండులో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన పొదటూరుపేట పోలీసులు బస్టాండుకు చేరుకున్నారు. పోలీసులను చూసిన విద్యార్థులు అక్కడ నుంచి పరుగులు తీశారు. పట్టుబడ్డ విద్యార్థులను అదుపులోకి తీసుకుని హెచ్చరించి పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment