జీఎస్టీ విధింపుపై వ్యాపారుల నిరసన
తిరుత్తణి: దుకాణాలకు జీఎస్టీ పన్ను విధింపునకు నిరసనగా వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం తిరుత్తణిలో ధర్నా చేశారు. వ్యాపారులు దుకాణాలకు చెల్లించే అద్దెలో 18 శాతం జీఎస్టీ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా వాణిజ్య, విక్రయ పన్ను విధించడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్ను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వాణిజ్య పన్నును తగ్గించాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తిరువళ్లూరు వెస్ట్ జిల్లా అఖిల వ్యాపారుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తిరుత్తణి కేంద్రంగా ధర్నా చేశారు. ఆసంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పెద్ద ఎత్తున వ్యాపారులు పాల్గొని ధర్నా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment