రూ.1.81 కోట్ల వస్తువుల అప్పగింత
తిరువళ్లూరు: గత ఆరు నెలల కాలంలో జరిగిన చోరీ కేసులను ఛేదించిన పోలీసులు నిందితుల నుంచి రికవరీ చేసిన రూ.1.81కోట్ల విలువ చేసే బంగారు, వెండి నగలు, సెల్‌ఫోన్‌లను బాధితులకు ఆవడి పోలీసు కమిషనర్ శంకర్ నేతృత్వంలో బుధవారం ఉదయం అప్పగించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి, రెడ్‌హిల్స్ పరిధిలోని 24 పోలీస్‌స్టేషన్ల పరిధిలో గత ఆరు నెలల్లో పలు చోరీలు, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తును చేపట్టారు. కాగా చోరీ కేసులో 162 సవర్ల బంగారు నగలు, 463 గ్రాముల వెండి, రూ.42.47 లక్షల నగదు, 457 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు ద్విచక్ర వాహనాలను నిందితుల నుంచి రికవరీ చేశారు. రికవరీ చేసిన మొత్తం వస్తువుల విలువ రూ.1.81 కోట్లు వుంటుందరి పోలీసులు తెలిపారు. ఈ వస్తువులను బాధితులకు ఆవడి కమిషనర్ శంకర్ అప్పగించారు. కాగా గత నెల రోజుల క్రితం సీబీఐ ఽఅధికారులమని బెదిరింపులకు దిగి రూ.1.45 కోట్లను వ్యాపారవేత్త బ్యాంకు ఖాతా నుంచి మాయం చేసిన వ్యవహారాన్ని సైతం పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment